ఈ రోజు మాత్రం రాజకీయాలు మాట్లాడను: పురందేశ్వరి

  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • ఆయన కుమార్తెగా పుట్టడం నా అదృష్టం
  • నివాళులు అర్పించిన అనంతరం పురందేశ్వరి
ఎన్టీ రామారావు వంటి మహోన్నత వ్యక్తికి తాను కుమార్తెగా జన్మించడం తన అదృష్టమని దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసినిలతో కలిసి నక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన పురందేశ్వరి, ఎన్టీఆర్ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించాలని కోరగా, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలు మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పు తెచ్చిన వ్యక్తి ఆయనేనని అన్నారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించింది ఎన్టీఆరేనని నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. సుహాసిని మాట్లాడుతూ, బడుగుల అభ్యున్నతి కోసం, మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని గుర్తు చేశారు.
Go Back to Shorts
NTR
Purandeshwari
Hyderabad
Birthday

More Telugu News